దుబాయ్ వేదిక జరుగుతన్న టీ ట్వంటి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 20 ఓవర్లలో 172\4 చేశారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ బ్యాట్ తో వీర విహారం చేసాడు. కేన్ విలియమ్ సన్ కేవలం 48 బంతుల్లోనే 85 పరుగులు సాధించాడు. 10 ఫోర్లతో 3 సిక్స్ లతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు.
అయితే న్యూజిలాండ్ ఓపెనర్ డారిల్ మిచెల్ 11 పరుగుల వద్దే అవుట్ కావడం తో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్ సన్ ఆకాశమే హద్దు గా చేలరేగాడు. ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకు పడ్డాడు. అలాగే ఆస్ట్రేలియా బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారు.హజల్ వుడ్ 3 వికెట్లు తీశాడు. అలాగే ఆడమ్ జంపా ఒక వికెట్ తీశాడు. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 173 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే ఓపెనర్లు తప్పక రాణించాలి. అలాగే డేవిడ్ వార్నర్ తన ఫామ్ కొనసాగిస్తే ఆస్ట్రేలియా విజయం సాధించడం ఖాయం.