Bigg Boss Telugu 5: సిరికి వార్నింగ్‌.. ష‌న్నూకు షాక్ ఇచ్చిన నాగ్

-

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ రియాలిటీ షో 5వ ఎడిషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. గొడవలు, ఏడవడం, అలగడం ల‌తో బుల్లి తెర ప్రేక్ష‌కులను పుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నారు కంటెస్టెంట్లు. అయితే ఈ వారం మాత్రం.. ఎన్నడూ లేని విధంగా దారుణాలు, ఘోరాలు జ‌రిగాయి. ఓ విధంగా చెప్పాలంటే.. కొంద‌రూ కంటెస్టెంట్ వారి హ‌ద్దులను దాటారు. శృతి మించిన ప్ర‌వ‌ర్త‌నతో చికాకు తెప్పించారు. వీట‌న్నీంటిని దృష్టిలో పెట్టుకుని .. కింగ్ నాగ్ ఓ రేంజ్లో ప్రిపేర్ అయ్యి వ‌చ్చిన‌ట్టు క‌నిపించాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తే.. ఈ వారాంతపు ఎపిసోడ్ మాత్రం రంజుగా సాగేలా ఉంది. సిరి, షణ్ముఖ్ ల‌కు హోస్ట్ నాగార్జున గ‌ట్టిగానే క్లాస్ పీకడం కనిపించింది.

బిగ్ బాస్లో ల‌వ్ ట్రాక్స్ కామ‌నే అంద‌రికీ తెలుసు.. ఇప్ప‌టికే మానస్, ప్రియాంక ల‌వ్ ట్రాక్ అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు బిగ్ బాస్ ల‌వ‌ర్స్. ఈ క్ర‌మంలో సిరి, షన్నులు చేసే చేష్టాలు చిరాకు పెట్టిస్తోన్నాయి. ఎందుకు అలుగుతారో..? ఎందుకు కోప్పడతారు..? ఎందుకు కలిసిపోతారు..? ఎవ‌రికి అర్థం కావ‌డం లేదు. ఈ వారం సిరి, ష‌న్నులు మ‌రి రెచ్చిపోయారు. సిరి .. ష‌న్నుకు ర‌క్తం దిష్టి తీయ‌డం. టైట్ హగులు ఇవ్వ‌డం, అంద‌రూ చూస్తుండ‌గానే లిప్ లాక్ తో రెచ్చిపోతున్నారు. నిన్న‌టి ఎపిసోడ్లో అంద‌రి ముందే హ‌గ్ చేసుకుని ఐ ల‌వ్ యూ ష‌న్నూ అంటూ రెచ్చిపోవ‌డం షాకింగ్ గానే ఉంది.

ఇదే విష‌యాన్ని ష‌న్నూని శ్రీ రామ్ అడ‌గ‌గా.. ఏం తెలియ‌డం లేదు. ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అయిపోయాను అంటూ.. ష‌న్నూ చెప్ప‌డం కూడా అంద‌రినీ షాక్ గురి చేసింది. సిరి కూడా ఇలానే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానంటూ సిగ్గు లేకుండా చెప్పేస్తోంది. సిరికి అల్రెడీ ఓ బాయ్ ప్రెండ్ ఉన్నాడు. త‌నతో ఎంగేజ్మెంట్ కూడా తెలుస్తోంది. అలాగే ష‌న్నూ కూడా దీప్తి సునయన ప్రేమ‌లో ఉన్నారు.

అయితే తాజాగా వీకెండ్ ఎపిసోడ్‌లో సిరి, షన్నులను నాగార్జున కడిగిపారేసినట్టు కనిపిస్తోంది. సిరిని మాత్రం ఓ రేంజ్లో క్లాస్ పీకిన‌ట్టు క‌నిపించింది. కోట్ల మంది ప్రేక్ష‌కులు మిమ్ముల్నీ చూస్తున్నారు. మనల్ని చూసి వాళ్లు ఇన్ స్పైర్ కావాలి. కానీ ఈ అమ్మాయిలా అస‌లు ఉండొద్ద‌ని మాత్రం అనుకోకూడదు కదా? అని ఘాటుగానే ప్ర‌శ్నించారు. నీ ప్రాబ్లం ఏంటి? అని సిరిని నాగార్జున అడిగాడు. నాకు కూడా ఏం అర్థం కావ‌డం లేదు. నా స్టోరీ నాకు తెలుసు.. బయట నేనేంటో అంద‌రికీ తెలుసు.. స్టిల్ ఎందుకు కనెక్షన్ వస్తుందో.. నాకు తెలియడం లేదు.. అంటూ సిరి అనేసింది. సిరి చెప్పిన సమాధానం చూస్తే.. ష‌న్నూను ప్రేమిస్తోందా? అనే సందేహం క‌లుగ‌క‌మ‌న‌దు.

అనంత‌రం ష‌న్నూను పిలిచాడు. ఏంటీ నీ ప్రాబ్ల‌మ్ అని గట్టిగానే అడిగాడు కింగ్ నాగ్. ఏమో సార్ ఏం జరుగుతున్నదో అర్ధం కావడం లేదు. మెంటల్‌గా చాలా వీక్ అయ్యాను. దీప్తిని ఎక్కువగా మిస్ అవుతున్నాను అంటూ స‌మాధాన‌మిచ్చాడు. దీంతో దీపూను అంతగా మిస్ అయిపోతున్నావా అంటూ నాగ్ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా చాలా మిస్ అవుతున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు షన్నూ. ఈ మాటలు విన్న నాగార్జున ఒక‌సారిగా సీరియస్ అయ్యాడు. బిగ్‌బాస్ మెయిన్ డోర్ తెరవండి.. ఓపెన్ ది డోర్స్ అని అనగానే.. మెయిన్ డోర్ తెరచుకొన్నది. దీప్తిని మిస్ అవుతున్నా అనే ఫీల్ ఉంటే.. వెంటనే బయటకు వెళ్లిపో అంటూ బాంబ్ పేల్చాడు నాగార్జున.

సిరి, షన్నుల వ్య‌వ‌హ‌రం శృతి మించిపోవ‌డం.. అలాగే వీరిద్ద‌రికి హోస్ట్ నాగార్జున పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన‌ట్లు టాక్. ష‌న్నూ హౌస్లో ఉంటాడా? వెళ్లిపోతాడా? అనేది కొద్ది గంటల్లో స్పష్టమ‌వుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news