ఓమిక్రాన్ ఎఫెక్ట్ : రెండో టెస్ట్ కు 25 శాతం ప్రేక్ష‌కులకే అనుమ‌తి

-

న్యూజిలాండ్, ఇండియా మ‌ధ్య జ‌రుగుత‌న్న టెస్ట్ సిరీస్ పై క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఎఫెక్ట్ ప‌డింది. ఈ టెస్ట్ సిరీస్ లో భాగం గా వ‌చ్చే నెల 3 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ రెండో టెస్ట్ ముంబాయి లో ని వాంఖ‌డే స్టేడియం లో జ‌ర‌గ‌నుంది. అయితే ఈ రెండో టెస్ట్ కు కేవ‌లం 25 శాతం ప్ర‌క్ష‌కుల‌కు అనుమ‌తి ఇస్తామ‌ని ముంబాయి క్రికెట్ అసోసియేషన్ స్ప‌ష్టం చేసింది. కాగ ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో 33 వేల మంది కూర్చునే కేపాసిటి ఉంది.

అయితే ఇప్పుడు 25 శాతం మంది మాత్ర‌మే ఈ టెస్ట్ మ్యాచ్ కు రానున్నారు. కాగ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న క‌రోనా వైర‌స్ నిబంధ‌నల ఆధారం గా ఈ టెస్ట్ జ‌రుగుతుంద‌ని ముంబై క్రికెట్ అసోసియేష‌న్ తెలిపింది. అలాగే ప్ర‌పంచ దేశాలను వ‌ణికిస్తున్న ఓమిక్రాన్ ఎఫెక్ట్ కూడా ఉంద‌ని తెలుస్తుంది. అయితే మ‌న దేశానికి ప్రతి రోజు విదేశాల నుంచి చాలా మంది వ‌స్తున్నారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం క రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news