ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలతో వచ్చిన వరదలకు ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. తిరుపతి లోనూ అదే పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పుడు ఏపీకి మరో ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ను వణికిస్తున్న జవాద్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారి విశాఖ తీరంవైపు దూసుకు వస్తున్నట్టు పేర్కొన్నారు.
అది దిశ మార్చుకుని తీరం వెంట పయనిస్తూ రేపు మధ్యాహ్నం వరకు ఒరిస్సా లోని పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. దాని ప్రభావం తో ఈ మూడు రోజులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80-100kmph వేగంతో కూడిన ఈదురుగాలులతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని అదే విధంగా ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను సైతం జారీ చేసింది. అంతే కాకుండా గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.