తమిళ నటుడు విజయ్ సేతుపతి పై పరువు నష్టం దావా కేసు నమోదు అయింది. విజయ్ సేతుపతిని తాను ప్రశంసలు కురిపించినా.. తన పై దాడి చేశారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ దాడి వల్ల తాను చాలా నష్ట పోయానని అందుకే పరువు నష్టం దావా వేస్తున్నట్టు తెలిపాడు. తమిళనాడు లోని చెన్నై కి చెందిన మహా గాంధీ అనే ఈ వ్యక్తి విజయ్ సేతుపతి పై పరువు నష్టం దావా వేశాడు. అయితే మైసూర్ విమానాశ్రయం లో విజయ్ సేతుపతి ని కలిశానని మహా గాంధీ తెలిపారు.
అప్పుడు విజయ్ సేతుపతి నటన గురించి.. ఆయన విజయాల గురించి చెప్పానని అన్నారు. అంతే కాకుండా విజయ్ సేతుపతి పై ప్రశంసలు కురిపించానని అన్నాడు. అయినా.. తన పై విజయ్ సేతుపతి దాడి చేశాడని తెలిపాడు. విజయ్ సేతుపతి తో పాటు ఆయన మేనేజర్ కూడా దాడి చేశాడని తెలిపాడు. ఈ దాడి లో తాన చెవి కి తీవ్ర గాయం అయిందని తెలిపాడు. దీంతో వినికిడి శక్తి కూడా కోల్పోయానని అన్నాడు. కానీ విజయ్ సేతుపతి ఈ దాడి విషయం లో ఒక కట్టుకథ అల్లారని తెలిపారు. అందుకే విజయ్ సేతుపతి పై ఫీర్యాదు చేశానని తెలిపాడు.