సినీ పరిశ్రమకు గతం లో ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి సంబంధాలు ఉండేవని.. కానీ నేటి జగన్ ప్రభుత్వం తో కాస్త గ్యాప్ వచ్చిందని సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వరకూ సినీ పరిశ్రమ తో అనుకూలం గానే ఉండేవారని అని అన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సినీ పరిశ్రమకు సాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరల సమస్యపై మరో సారి ఆలోచించాలని అన్నారు.
అఖండ కలెక్షన్ లు పూర్తిగా హీరో బాలయ్య సామర్థ్యం తో నే వచ్చాయని అన్నారు. అలాగే గతంలో వైఎస్ ఆర్ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చిందని గుర్తు చేశారు. చిరంజీవి సినిమా కు అనేక సమస్యలు వచ్చాయి. ప్రజల నుంచి చెడ్డ పేరు వస్తుందని అధికారులు హెచ్చరించినా.. అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని అన్నారు. దీని పై అనేక సమస్యలు వచ్చాయని గుర్తు చేశారు. అయితే ఆన్ లైన్ టికెట్ అనేది తమకు సాయం చేస్తుందని అన్నారు. కానీ టికెట్ల ధర విషయం లో తాము చాలా నష్ట పోతున్నామని అన్నారు. అలాగే తాము ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని మాత్రమే ప్రవేశ పెట్టాలని అన్నామని అన్నారు.