ఇండియాలో పెరిగిన క‌రోనా..కొత్త‌గా 9419కేసులు, 159 మ‌ర‌ణాలు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా మహమ్మారి కేసులు… ఇవాళ అమాంతం పెరిగిపోయాయి. కొత్త వేరియంట్.. వ్యాపిస్తున్న నేపథ్యం లో కరోనా కేసులు పెరగడం అందరినీ కలవరపెడుతోంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం.. దేశంలో గడచిన 24 గంటల్లో.. కొత్త‌గా 9,419 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,66,241 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 94,742 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.46 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 159 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,74,111 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,251 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,40,97,388 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,30,39,32,286 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 80,86,910 మందికి క‌రోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news