ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఇవాళ కాస్త పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా… 7,447 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో 7,886 మంది… కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా… అదే సమయంలో 391 మంది కరోనా కారణంగా మరణించారు.
ఇక ప్రస్తుతం దేశంలో ఆక్టివ్ కరోనా మహమ్మారి కేసుల సంఖ్య.. 86,415 గా ఉంది. ఇక ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగు లక్షల 76 వేల 869 గా నమోదు అయింది. అలాగే ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య.. 3,41,62,765 గా నమో దు అయింది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారు సంఖ్య 1,35,99,96,267 కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
India reports 7,447 new #COVID19 cases, 7,886 recoveries, and 391 deaths in the last 24 hours.
Active cases: 86,415
Total recoveries: 3,41,62,765
Death toll: 4,76,869
Total Vaccination: 1,35,99,96,267