భారత్ కు చెందిన యువ స్ప్రింటర్ తరన్ జీత్ కౌర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నిర్వహించిన డోప్ పరీక్షలలో తరన్ జీత్ కౌర్ విఫలం అయింది. దీంతో ఆమె డోపింగ్ కు పట్టుబడింది. ఢిల్లీ కి చెందిన తరన్ జీత్ కౌర్ షార్ట్ రన్ రేసులో ఇప్పటి వరకు ఎన్నో మెడల్స్ ను కొట్టింది. 20 ఏళ్ల వయస్సు లోనే అనేక పతకాలను సాధించింది. జాతీయ అండర్ – 23 విభాగంలో 100, 200 మీటర్ల షార్ట్ రేస్ లో స్వర్ణాలు సాధించింది. దీంతో పాటు జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ లో కూడా తరన్ జీత్ కౌర్ పతకాలు సాధించింది.
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో పతకం నెగ్గింది. వరుస పతకాలతో జోష్ మీద ఉన్న తరన్ జీత్ కౌర్ భారత షార్ట్ పరుగు పందెంలో భవిష్యత్తు ఉందని అనుకున్నారు. కానీ అకస్మాతుగా తరన్ జీత్ కౌర్ డోపింగ్ పరీక్షలో ఫెయిల్ కావడంతో డోపింగ్ కు పట్టుపడినట్టు అయింది. కాగ డోపింగ్ పరీక్షలలో ఫెయిల్ అయితే 4 సంవత్సరాల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే నాడా తరన్ జీత్ కౌర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.