క్రికెటర్ రషీద్ ఖాన్ ఇంట విషాదం

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ రషీద్ ఖాన్ తీవ్ర విషాదం లో కి కూరుకుపోయాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రషీద్ ఖాన్… కజిన్ నిన్న అర్ధరాత్రి మృతి చెందారు. ఈ విషాదకరమైన వార్త నూతన అభిమానులతో పంచుకుంటూ ట్విట్టర్ వేదికగా క్రికెటర్ రషీద్ ఖాన్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.

” మా కజిన్ నిన్న మృతి చెందారు. అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. నీ దూరం తో చాలా కోల్పోతున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక ఈ వార్త విన్న నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. రషీద్ ఖాన్ కజిన్ కు సంతాపం తెలిపారు క్రికెట్ ఫ్యాన్స్. కాగా రషీద్ ఖాన్… ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఆడుతున్నాడు. ఇటీవలే తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు రషీద్ ఖాన్. అటు సన్రైజర్స్ హైదరాబాద్ కూడా రషీద్ ఖాన్ న్యూ ఈసారి వదులుకుంది.