మెదక్ జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి అతి భారీ భారీ వర్షం కురిసింది. శివ్వంపేటలో మోస్తరు వర్షం కురిసింది. 5.6మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. రామాయంపేట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో సుమారు 40 నిమిషాల పాటు కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులకు కోనాపూర్ శివారులోని రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. వాహనాలు ఇరువైపులా ఆగడంతో జేసీబీ సహాయంతో చెట్లను తొలగించారు.