టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2006 లో వచ్చిన దేవ దాసు సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఇలియానా. ఈ సినిమాలో హీరో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా ఇలియానా నటించి.. మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా విజయం సాధించడంతో.. అప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక ప్రస్తుతం ఆమె బాలీవుడ్ వెళ్లి పోయింది. ఇది ఇలా ఉండగా… తాజాగా మహిళల పీరియడ్స్ పై హీరోయిన్ ఇలియానా షాకింగ్ కామెంట్స్ చేసింది. పీరియడ్స్ సమయంలో.. కొంత మంది మహిళలకు కడుపు నొప్పి, ఇంకొంత మందికి అధిక రక్త స్రావం మరికొందరికి నడుము నొప్పి, పొత్త కడుపులో తీవ్ర పోటు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ మూడు రోజులు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె తెలిపింది. ఆ సమయంలో వర్కౌట్స్ చేస్తే.. నొప్పి తగ్గుతుందని కొంత మంది చెప్పారని.. అలా చేయడం వల్ల అన్ని సార్లు సత్పాలితాలు రావని ఆమె చెప్పారు.