రాష్ట్ర ప్రభుత్వ నూతన జోనల్ విధానంలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్‌లో విధులు నిర్వహిస్తున్న బలరాం యాదవ్ సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. బదిలీపై సూర్యాపేటకు రావడం సంతోషంగా ఉందన్నారు. బిల్డింగ్, లే అవుట్ పర్మిషన్లు ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేస్తామని, ప్రజలు దీనికి స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.