Good news for dairy farmers from Telangana government: పాడి రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. త్వరలోనే పాడి రైతుల అకౌంట్లోకి డబ్బులు రానున్నాయి. విజయ డైరీ కి పాలు విక్రయించే రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓనెల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఏకంగా 50 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.
ఈ పెండింగ్ నిధులను వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. మరో నెల బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని వివరించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పాడి రైతుల నుంచి రైతు 4.4 లక్షల లీటర్లను విజయ డైరీ కొనుగోలు చేస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధుల కొరత ఏర్పడింది. దీంతో పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం.