గుడ్ న్యూస్ : కరోనా నుంచి కోలుకున్న మహేష్ బాబు

సంక్రాంతి పండుగ దినాన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు అదిరిపోయే శుభ వార్త అందింది. ఇటీవల కరోనా బారిన పడిన ప్రిన్స్ మహేష్ బాబు… ఇవాళ ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో ప్రిన్స్ మహేష్ బాబుకు కరోనా నెగిటివ్ గా రిపోర్టు వచ్చినట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడక పోయినా.. మొత్తానికి మహేష్ బాబు కోలుకున్నారని పక్కా సమాచారం అయితే ఉంది.

దాదాపు ఎనిమిది రోజులకు పైగా మహేష్ బాబు హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. సరైన చిట్కాలను పాటించడంతో ఆయన త్వరగా కోలుకున్నారని తెలుస్తోంది. కాగా జనవరి 6వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటం తో కరోనా పరీక్షలు చేయించుకున్న మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఆయన కరోనా బారినపడ్డ అనంతరమే… మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మృతి చెందారు. దీంతో రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా మహేష్ బాబు దూరమయ్యారు. మహేష్ బాబు స్థానంలో ఆయన భార్య నమ్రత అంత్యక్రియలకు హాజరయ్యారు.