తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రదోషకాల సమయంలో ఆలయానికి విచ్చేసిన గవర్నర్ దంపతులు స్వామి వారి మహాన్యాస రుద్రాభిషేకం సేవలో పాల్గొన్నారు. గవర్నర్ను ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, మండపంలోని స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, ఈవో సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి : రామలింగేశ్వరస్వామి సేవలో రాష్ట్ర గవర్నర్
-