ఏపీలో రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉపకులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా..? అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా.. కిషన్ రెడ్డి భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా..? ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు. మాదిగలకు ద్రోహం చేయడం లేదా..? అని సీఎం ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోఫిస్తున్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేవడం లేదు. ఒక్క ప్రాజెక్టుని తీసుకురాలేదు. ఆరేల్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు. కిషన్ రెడ్డి రెడ్డి వల్లనే మెట్రో, మూసీ ప్రక్షాళన నిలిచిపోయిందన్నారు. కేంద్రానికి మనం రూపాయి చెల్లిస్తే.. మనకు కేంద్రం 42 పైసలు ఇస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news