హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. సోమవారం జంట నగరాల్లో పలు రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండవని అధికారులు కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో కొన్ని రూట్లలో ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నాయని తెలిపారు. ట్రాక్ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలోనే కొన్ని రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీస్ లను రద్దు చేశామని తెలిపారు.
ఈ నెల 17 వ తేదీనే ఎంఎంటీఎస్ సర్వీస్ పై రద్దు ఉంటుందని తెలిపారు. తిరిగి మంగళ వారం నుంచి అన్ని రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీస్ లు మళ్లీ పునఃప్రారంభం అవుతాయని వెల్లడించారు. కాగ జంట నగరాల్లో నడుస్తున్న మొత్తం 79 ఎంఎంటీఎస్ సర్వీస్ లలో 36 రైళ్లను సోమవారం రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నగరంలో ఎంఎంటీఎస్ లలో రద్దీ తగ్గడంతో ట్రాక్ మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సమయంలో ఎంఎంటీఎస్ సర్వీస్ లు రద్దు చేసినా.. ప్రభావం ఎక్కువ ఉండదని తెలిపారు.