గ్రామ పంచాయతీ కార్యదర్శి పని వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉదయం 10 గంటలకు హాజరయ్యే పంచాయతీ కార్యదర్శిలు ఇకపై ఉదయం 7 గంటలకు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలలో మాదిరిగానే గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలలో ఉదయం 7 గంటలకే ఇకపై విధులకు గ్రామ కార్యదర్శిలు హాజరుకానున్నారు.