రెండు రోజుల్లో పెళ్లి.. 1.33 బంగారు ఆభరణాలు చోరీ..!

-

రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో పెళ్లి.. పాపం అంతలోనే ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారం, నగదు చోరీకి గురైంది. ఏకంగా 1.33 కిలోల బంగారు ఆభరణాలు, 800 గ్రాముల వెండి నగలు, రూ.2.50 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తెలంగాణలోని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్సి రాధా బాలకృష్ణ తన కుమార్తె పెళ్లి నవంబర్ 20న నిశ్చయించాడు. 

Police
Police

ఈ నెల 17న పెళ్లి సంబురాల్లో భాగంగా హల్డీ మెహందీ కార్యక్రమాలను నిర్వహించారు. పెళ్లి కోసం వచ్చిన మహిళలందరూ ఆభరణాలను భద్రపరిచేందుకు ఇంట్లో ఉన్న ఆల్మారాను తెరిచారు. అప్పటికే పెల్లి కోసం చేయించిన బంగారు, వెండి ఆభరణాలు ఆల్మారాలో కనిపించకపోవడంతో వారు ఆశ్యర్యపోయారు. చేసేది ఏమి లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. బయటి వారితో పాటు బంధువులు ఎంత మంది వచ్చారు. నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరూ వెళ్లారనే విషయాలపై ఆరా తీసారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news