మెట్రో రైలు రెండో దశ నిర్మాణం చాలా సవాళ్లతో కూడుకున్నదని హైదరాబాద్ మెట్రో ఎం.డీ. NVS రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రో రెండో దశ నిర్మాణం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించామని.. రెండో దశలో దాదాపు 76 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఇది చాలా సవాళ్లతోకూడుకున్నది అన్నారు.
మెట్రో రైలు రెండో దశ నిర్మాణం చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలు ఏమి ముందుకు రావడం లేదని.. మెట్రో రైలు మొదటి దశ నిర్మాణంలో ఎల్అండ్ టీ సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందని ఈ అనుభవంతో ప్రైవేటు సంస్థలు ముందుకు రావడానికి భయపడుతున్నాయని తెలిపారు. ఫస్ట్ పేజ్ వల్ల ఎల్అండ్ టీ కి రూ.6వేల కోట్ల నష్టం వచ్చిందని.. ఏడాదికి రూ.13000 కోట్ల నష్టాన్ని ఎల్ అండ్ టీ భరిస్తోందని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నాయని.. మెట్రో నిర్మాణానికి అప్పులు చేసేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపించడం లేదని వివరించారు. మెట్రో ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని సీఎం కి సూచించినట్టు తెలిపారు.