డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవం
తమిళనాడులో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో యాభై ఏళ్ల తర్వాత పార్టీ అధ్యక్షుడి మార్పు జరిగింది. డీఎంకే కార్యవర్గం స్టాలిన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. యాభై ఏళ్లపాటు డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన కరుణానిధి గత కొద్ది రోజుల క్రితమే కన్నుమూసిన సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఉన్న స్టాలిన్ అన్ని తానై పార్టీ వ్యవహారాలను చాలా రోజుల క్రితం నుంచి చూసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీలో బలమైన నేతగా, తండ్రికి తగ్గ రాజకీయ వారసుడిగా డీఎంకే కార్యకర్తలు, నేతన నమ్మకాన్ని సాధించగలిగారు. దీంతో అటు పార్టీ, ఇటు కుటుంబ సభ్యుల నుంచి మెజార్జీ మద్దతును ఆయన కూడగట్టారు. స్టాలిన్ అన్న అళగిరి కాస్త కలకలం రేపాడు..తండ్రి మద్దతుదారులు తన వైపే ఉన్నారని అవసరమైనప్పుడు సత్తాచాటనున్నట్లు తెలిపారు. అన్న బెదిరింపులని ఖాతరు చేయని స్టాలిన్ అధ్యపీఠాన్ని చేపట్టారు.
నాకు చెల్లెలు మాత్రమే ఉంది…
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ అన్న అళగిరి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చెల్లెలు (కనిమొళి) మాత్రమే ఉందని, అన్నయ్య లేడని అన్నారు. గతంలో కరుణానిధి ఉన్న సమయంలోనే పార్టీ నుంచి అళగిరిని బహిష్కరించిన సంఘటనను గుర్తుచేశారు