నేడు తెలంగాణ‌కు ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక‌

-

తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స‌మ‌తా మూర్తి రామానుజ చార్యులు వెయి ఏళ్ల ఉత్స‌వాలకు వ‌రుస‌గా ప్ర‌ముఖులు వ‌స్తున్నారు. బుధ‌వారం మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ దంప‌తుల‌తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వత్ పాల్గొన్నారు. అలాగే ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వ‌చ్చారు. అలాగే జ‌గ‌న్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు చాలా మంది ప్ర‌ముఖులు ఈ ఉత్స‌వాల‌కు వ‌స్తున్నారు.

తాజా గా ఈ రోజు కేంద్ర ర‌క్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ రానున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వ‌చ్చి అక్క‌డ నుంచి నేరుగా ముచ్చింతల్ కు వ‌స్తారు. అక్క‌డ స‌మ‌తా మూర్తి రామానుజ చార్యుల విగ్ర‌హాన్ని ద‌ర్శించుకుంటారు. అలాగే చిన్న జీయ‌ర్ స్వామి తో క‌లిసి 108 దేవాల‌యాల న‌మూనాను చూస్తారు. అనంత‌రం స‌మ‌తా మూర్తి రామానుజ చార్యుల పూజాలు, ప్ర‌వ‌చానాల‌ల్లో పాల్గొంటారు. అనంత‌రం ఈ రోజు రాత్రే ఢిల్లీకి తిరిగి బ‌య‌లు దేరుతారు.

Read more RELATED
Recommended to you

Latest news