కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఘాటు స్పందించిన విషయం తెలిసిందే. తాజా గా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అసోం సీఎం హింమత బిశ్వశర్మ స్పందించారు. గాంధీల కుటుంబాలపై విమర్శలు చేయకుడదా అని అన్నారు. తాను మాట్లాడిన దానిలో తప్పు ఏం ఉందని కేసీఆర్ ను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ.. ఆర్మీ అధికారులపై చేసిన వ్యాఖ్యలు తప్పు కాదా అని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ భారత్ ఆర్మీని అవమానించారని, బిపిన్ రావత్ ను కూడా అవమానించారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడిది తప్పు కాదు.. తాను మాట్లాడింది తప్పా అని ప్రశ్నించారు. కాగ శనివారం యాదాద్రిలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అసోం సీఎం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పుట్టుక గురించి అలా మాట్లాడుతారా.. అని అన్నారు. అసోం సీఎం ను వెంటనే బర్తరఫ్ చేయాలని కేసీఆర్ అన్నారు. అసోం సీఎం చేసిన వ్యాఖ్యలే మోడీ, బీజేపీ సంస్కారామా అంటూ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.