తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా.. కేవలం వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లోనే సెలవులు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీంతో వరంగల్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సెలవులపై ప్రకటన చేశారు. రేపు అనగ శుక్రవారం ఈ రెండు జిల్లాల్లో విద్యా సంస్థల తో పాటు స్థానిక సంస్థలకు అన్నింటికీ సెలవులు ఉంటాయని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. కాగ బ్యాంకులు మాత్రమే ఓపెన్ ఉంటాయని ఆ రెండు జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.
కాగ శుక్ర వారం సెలవు ఇవ్వడంతో .. మార్చి 12న అనగా రెండో శనివారం రోజు వర్కింగ్ డే గా ఉంటుందని కలెక్టర్లు తెలిపారు. కాగ కరోనా కారణంగా ఇప్పటి వరకు సెలవులు ఎక్కవ రావడంతో తాజా గా పండుగల పేరుతో మళ్లీ సెలవులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఒక వేళ సెలవులు ఇచ్చినా.. ఆదివారం, రెండో శనివారం వంటి హాలీడేస్ లలో వర్కింగ్ డేస్ గా ప్రకటిస్తుంది. అయినా… మేడారం జాతర సందర్భంగా అన్ని జిల్లాలకు సెలవులు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాగ దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదు.