ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగిన నాటి నుంచి అంతర్జాతీయంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అలాగే యూకే, అమెరికా వంటి దేశాలు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నిధులను ఫ్రీజ్ చేశారు. అలాగే అంతర్జాతీయంగా క్రీడల పరంగా కూడా రష్యా పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే రష్యాను ఫుట్ బాల్ ప్రపంచ కప్ తో పటు అంతర్జాతీయ మ్యాచ్ లు, లీగ్ ఆడకుండా ఫిఫా బ్యాన్ విధించింది. తాజా గా రష్యా కు ప్రపంచ బ్యాడ్మింటన్, హాకీ సమఖ్యలు కూడా బిగ్ షాక్ ఇచ్చాయి.
రష్యా తో పాటు బెలారస్ దేశాల ఆటగాళ్లు.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్, హాకీ టోర్నమెంట్లు ఆడకుండా బ్యాన్ విధించాయి. ఈ బ్యాన్.. తాము తిరిగి నోటీసులు జారీ చేసేంత వరకు అమల్లో ఉంటాయని తెలిపాయి. దీనికి సంబంధించిన ప్రకటనను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తో పాటు హాకీ సమఖ్య మంగళ వారం సాయంత్రం విడుదల చేశాయి. తాము తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించాయి. దీంతో ఈ నెల 8 వ తేదీ నుంచి జరగబోతున్న జర్మన్ ఓపెన్ లో రష్యాతో పాటు బెలారస్ దేశాల ఆటగాళ్లు పాల్గొనరు.