స్నేహితుడు మద్యం మత్తులో ఉన్న సమయాన్ని చూసి ఓ వ్యక్తి ఏటీఎం కార్డును చోరీ చేసి డబ్బులన్నింటినీ కాజేసాడు. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముమ్మర చర్యలు చేపట్టిన మైలార్దేవ్పల్లి పోలీసులు తోటి స్నేహితుడు సందీప్ దొంగిలించినట్టు గుర్తించారు. ఏటీఎం కార్డు నుండి రూ.2.15 లక్షలను విత్ డ్రా చేసినట్లు తెలిపారు. వీరిద్దరు నిత్యం మద్యం సేవించేవారని పోలీసులు వెల్లడించారు.