శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టు బెంగళూర్ లోని చిన్న స్వామి స్టేడియంలో జరుగుతన్న విషయం తెలిసిందే. కాగ శనివారం జరిగిన మొదటి రోజు ఆటలో బౌలర్లదే ఆధిపత్యం నడిచింది. రెండు జట్లకు చెందిన బౌలర్లు అద్భుతంగా రాణించారు. దీంతో డే అండ్ నైట్ మ్యాచ్ లలో ఒక రోజులో అత్యధిక వికెట్లు పడ్డ టెస్టుగా రికార్డు నెలకొల్పాయి. ఈ టెస్ట్ లో మొదటి రోజు రెండు జట్లు కలిసి.. ఒకే రోజు ఏకంగా 16 వికెట్లను పడగొట్టాయి.
కాగ ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 252 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయస్ అయ్యార్ (92) ఒక్కడే రాణించాడు. లంక బౌలర్లు.. లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీన్ జయవిక్రమ మూడు వికెట్ల చొప్పన తీసుకున్నారు. అలాగే ధనుంజయ డి సెల్వ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ను భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
భారత బౌలర్ల దాటికి లంక బ్యాటర్ల క్రిజ్ లో నిలవలేకపోయారు. మాథ్యూస్ (43) ఒక్కడే పర్వలేదనింపించాడు. కాగ భారత బౌలర్లు.. బుమ్రా 3 వికెట్లను కూల్చాడు. అలాగే షమీ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు. కాగ నేడు రెండో రోజు ప్రారంభం కానుంది.