మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన మైసూర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి.
అకడమిక్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధులకు దరఖాస్తు చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం పోస్టుల సంఖ్య 18. అభ్యర్ధుల వయసు 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. సీనియర్ ఫెలో, అసోసియేట్ ఫెలో, యూడీసీ, ఎల్డీసీ పోస్టులు ఖాళీగా వున్నాయి.
ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.21,200ల నుంచి రూ.41,000ల వరకు జీతం ఇస్తారు. విద్యార్హత గురించి చూస్తే.. పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత ఉండాలి. అలానే పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి.
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా అప్లై చెయ్యచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 30, 2022. పూర్తి వివరాలను https://www.ciil.org/ లో చూడచ్చు.