మీరు పోస్టాఫీస్‌లో డబ్బులు పెడుతూ ఉంటున్నారా..? అయితే మీరు తప్పకుండ ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీస్ పలు స్కీమ్స్‌కు సంబంధించి వడ్డీ చెల్లింపు విధానాన్ని పోస్ట్ ఆఫీస్ మారుస్తోంది. మరి ఇక దీని గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీస్ పలు స్కీమ్స్‌కు సంబంధించి వడ్డీ చెల్లింపు విధానాన్ని మార్చనున్నారు.
వడ్డీ డబ్బులను క్యాష్ రూపంలో ఇవ్వరు. అంటే నగదు రూపంలో చేతికి వడ్డీ డబ్బులు అందవు. కనుక పోస్టాఫీస్‌లో డబ్బులు దాచుకునే వాళ్ళు ఈ విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఈ కొత్త రూల్ ఏయే స్కీమ్స్ కి వర్తిస్తాయి అనేది చూస్తే.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్ అకౌంట్లు వంటి వాటికి ఇది వర్తిస్తుంది.
ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ సర్క్యూలర్ ద్వారా తెలిపింది. వడ్డీ డబ్బులు నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ అకౌంట్‌లో పడతాయి. అదే కస్టమర్స్ వింగ్స్ అకౌంట్‌ను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్లతో లింక్ చేసుకోకపోతే అప్పుడు డబ్బులు చెక్ రూపంలో అందుతాయి.
మీరు ఈ పథకాల్లో డబ్బులు పెడుతూ ఉంటే మీ సేవింగ్స్ ఖాతాను స్కీమ్స్‌తో లింక్ చెయ్యండి. లేకపోతె ఇబ్బంది తప్పదు. మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ వడ్డీ మొత్తాన్ని పొందాలంటే కచ్చితంగా వారి సేవింగ్స్ ఖాతాను ఈ స్కీమ్స్‌తో లింక్ చేసుకోవాలని కోరింది. ఒకవేళ సేవింగ్స్ స్కీమ్స్‌తో సేవింగ్స్ ఖాతాను లింక్ చేసుకోకపోతే.. వడ్డీ డబ్బులను సండ్రీ అకౌంట్‌లో డిపాజిట్ చెయ్యాలి. ఏప్రిల్ నుంచి సండ్రీ అకౌంట్ ద్వారా క్యాష్ రూపంలో చెల్లింపులు ఉండవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ చెప్పేసింది.