ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడెవ్వడు లేడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడు ఎవడు లేడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా  పొంగులేటి ఐటీసీ కోహినూర్ లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో దాదాపు నాలుగు గంటలు సమావేశం జరిగింది. వీళ్లకి లోపల లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి.  ఇదే రేవంత్ రెడ్డి డబల్ ఇంజన్లో ఒక ఇంజిన్ అదానీ.. ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు.

KTR Press Meet At Telangana Bhavan

అందుకే ప్రధాని కోసం దామగుండం అప్పజెప్పాడు.. అదానీ కోసం రామన్నపేట అప్పజెప్పాడు. మధ్యలో మూసీని మేఘా కృష్ణా రెడ్డికి ఇచ్చాడు.  ఒక్కొకటిగా వీళ్ళ బట్టలు అన్ని విప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీది అన్నారు కేటీఆర్. సుంకిశాల ఘటనకు కారణమైన ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆనాడు డిమాండ్ చేసామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా అదే సంస్థకు మూసీ ప్రాజెక్ట్ ను ఇచ్చేందుకు సిద్ధమవ్వడం దారుణమన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news