అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఈ నెల 5న రిలీజ్ అవనుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు. సమంతతో పాటుగా ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది. నిన్ను కోరి సినిమాతో హిట్ అందుకున్న శివ నిర్వాణ రెండో ప్రయత్నంగా మజిలీ చేశారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందని తెలుస్తుంది.
సెన్సార్ వాళ్లు మజిలీకి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమా అందరు చూసేయొచ్చని అంటున్నారు. పెళ్లి తర్వాత చైతు, సమంతలు కలిసి చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన మజిలీ ట్రైలర్ సినిమాపై మరింత హోప్ పెంచింది. మరి మజిలీతో చైతు కెరియర్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.