భార్యా భర్తల మధ్య గొడవలకు కారణమయ్యేవి మాటలే.. భార్య ఒక మాట అంటే భర్త రెండు మాటలు అంటాడు.. అలా అలా గొడవ పెద్దవుతుంది. అయితే ఇలా మాటల యుద్ధంతో విడిపోయిన ఎన్ని కుటుంబాలను చూశాడో కాని అమెరికా వాటర్ బ్యూరీకి చెందిన బ్యారీ డాసన్ తన భార్య దగ్గర 62 ఏళ్లుగా మూగవాడిగా నటిస్తున్నాడట. సినిమా, టివి వాళ్లైనా ఏదో కొన్ని గంటలు మాత్రమే నటిస్తారు కాని ఇతను మాత్రం 62 ఏళ్లుగా భార్య ముందు చెవిటి, మూగ వ్యక్తిగా నటించాడట. అందువల్లే అతని కాపురం సాఫీగా సాగిందట.
ప్రస్తుతం 84 ఏళ్ల వయసు ఉన్న బ్యారీ డాసన్ ఓ బార్ లో మాట్లాడుతూ.. పాట పాడుతున్న వీడియో తన భార్య కంట పడిందట ఇంకేముందు ఇన్నేళ్లుగా తనని మోసం చేస్తూ వచ్చాడని అతనికి విడాకులు ఇచ్చిందట ఆమె. పాపం 62 ఏళ్లు మ్యానేజ్ చేసిన అతను ఇప్పుడు ఆమెను మోసం చేసిన వాడిగా మిగిలిపోయాడు. బ్యారీ డాసన్ అతని భార్య డోరతీకి ఆరుగురు సంతానం.. 13 మంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారట. పిల్లలు, మనవళ్లకు కూడా డాసన్ మూగ వాడిగానే తెలుసట. మొత్తానికి డోరతీ ఇచ్చిన షాక్ కు నిజంగానే డాసన్ కు నోరు మూగబోయి ఉండొచ్చు.