PF ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!

-

పీఎఫ్ ఖాతాదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ ని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ పెన్షన్ డబ్బులను రెట్టింపు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పెన్షన్ డబ్బులను రెట్టింపు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదే కనుక అయ్యింది అంటే పీఎఫ్ చందాదారులకు రిలీఫ్ గా ఉంటుంది.

ఎంప్లాయీస్ ప్రీవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ కింద ఇప్పుడు సబ్‌స్క్రైర్లకు నెలకు రూ.1000 పెన్షన్ ని ఇస్తోంది. నిజానికి ఈ అమౌంట్ చాలా తక్కువ. అందుకే ఈ డబ్బులను పెంచాలని పార్లమెంట్ కమిటీ అంటోంది. పార్లమెంట్ స్టండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2022-23ని పార్లమెంటుకు సమర్పించింది.

ఇందులో పీఎఫ్ పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపింది. అయితే పీఎఫ్ చందాదారులకు అందించే పెన్షన్ డబ్బులను పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖకు చెప్పి నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోమని అంది. ఎనిమిది ఏళ్ల కిందట పీఎఫ్ పెన్షన్‌ను రూ.1000గా నిర్ణయించారని పార్లమెంట్ స్టండింగ్ కమిటీ పేర్కొంది.

ఇప్పుడు ఇది చాలా తక్కువ అని అంటోంది. ఇది ఇలా ఉంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఇందుకు ఇంకా అంగీకరించలేదు. కనీస పెన్షన్‌ను రూ.1000గానే కొనసాగించింది. అలానే పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు మరీ ముఖ్యంగా 2015 కన్నా ముందు పదవీ విరమణ చేసిన వారు ఇనామినేషన్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నివేదిక చెబుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news