ఏప్రిల్ 1 నుంచి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు

0
25

తిరుమల శ్రీ వారి భక్తులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏఫ్రిల్ 1వ తేది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించనున్నట్లు టిటిడి పాలక మండలి ప్రకటన చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని భక్తులు తిరుమలకు రావాలని టీటీడీ పేర్కొంది. ఇక అటు తిరుపతిలో సర్వదర్శన టోకేన్లు జారి చేస్తూంది టిటిడి.


తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో నాలుగోవ రోజు కాగా… ఇవాళ పుష్కరిణిలో ఐదు ప్రదక్షణములుగా తెప్పల పై విహరించనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి. ఎల్లుండి తుంభూర తీర్ద ముక్కోటి….రెండు సంవత్సరాల తరువాత భక్తులను అనుమతిస్తూంది టిటిడి. కాగా.. నిన్న శ్రీవారిని 61982 మంది భక్తులు దర్శించుకోగా..27400 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండి ఆదాయం 3.88 కోట్లు వచ్చింది. కాగా… కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో… ఆర్జీత సేవలను రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇక ఇప్పుడు కరోనా తగ్గడంతో..  ఈ సేవలను మళ్లీ ప్రారంభిస్తున్నారు.