ఒక వృద్ధురాలిపై కొంత మంది దారుణానికి ఒడిగట్టారు. పట్ట పగలే.. కొంత మంది దుండగులు వృద్ధురాలిపై విరుచుకుపడ్డారు. ఆ వృద్ధురాలిని కింద పడేసి దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని రాజ్ నరగర్ ఎక్స్ టెన్షన్ వద్ద చోటు చేసుకుంది. కాగ వృద్ధురాలు ఒక్కరే రోడ్డు పై నడుచుకుంటు వెళ్తుంది. ఆమె చేతికి గోల్డ్ చైన్ తో పాటు ఉంగరాలు కూడా ఉన్నాయి. అయితే వృద్ధురాలిపై ఉన్న బంగారాన్ని కొట్టేయాలని ఇద్దరు దుండగులు ప్లాన్ చేశారు.
తలను కప్పివేస్తు.. హెల్మెట్ ధరించి.. గన్ తో బెదిరించారు. ఆ వృద్ధురాలు ప్రతి ఘటించింది. దీంతో ఆ వృద్ధురాలిపై దుండగులు విచక్షణ రహిత్యంగా దాడి చేశారు. కిండ పడేసి పిడిగుద్దులు కురిపించారు. పక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి.. ఆమె పై ఉన్న బంగారం అభరణాలను లాక్కున్నారు. దీని తర్వాత వృద్ధిరాలిని అక్కడే వదిలేసి పరారు అయ్యారు.
ఆ దుండగులను గమనిచిన స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. దీంతో బాధితులురాలు పోలీసులను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేసింది. కాగ పోలీసులు దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.