ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన అని విశాఖ పట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాగల మూడు రోజల్లో ఆంధ్ర ప్రదేశ్ లో తేలిక పాటి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగ అండమాన్ తీరంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగ ఈ అల్ప పీడనం క్రమంగా బలపడుతూ.. బంగ్లాదేశ్, మయన్మార్ వైపుగా కదులుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
కాగ రేపటి లోగ ఈ అల్ప పీడనం పూర్తిగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాగల మూడు రోజల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలనిఒ కోస్తాంధ్ర తో పాటు ఒడిశా తీరంలో కూడా తేలిక పాటు నుంచి మోస్తారు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగ గత కొద్ది రోజుల నుంచి ఊష్ణోగ్రతలు భారీ గా పెరుగుతున్న సమయంలో.. వర్షం వార్త విన్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగ ఒక్క సారి వర్షం పడితే.. వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉంది.