ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న సమయంలో చల్లటి వార్త వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన అని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో వాయు గుండం ఈ రోజు అల్ప పీడనంగా మారిందని వివరించింది.
ఈ అల్ప పీడనం ప్రభావంతో కోస్తా ప్రాంతం తో పాటు రాయలసీమలోనూ నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా.. ఈ రోజు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. అలాగే స్వల్పంగా ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందని వెల్లడించింది.