నాకు ఇవ్వాల్సిన డబ్బులు.. జుకల్కర్ ఇవ్వడం లేదు : సమంత సంచలనం

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది.. అక్కినేని నాగచైతన్య- సమంత అనే చెబుతారు. కానీ ఆరు నెలల కిందట.. తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. ఇక విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత.

ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అయితే.. ప్రస్తుతం సమంత.. యశోద సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉంది. ఇక సమంత తో పాటు ఆమె హెయిర్‌ స్టైలిష్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ కూడా షూటింగ్ స్పాట్‌ లోనే ఉన్నాడు.

అయితే… షూటింగ్‌ విరామం సమయంలో.. సమంత, ప్రీతమ్‌ మధ్య ఓ ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ప్రీతమ్‌ కే సమంత.. కటింగ్‌ చేసి.. అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతేకాదు.. దానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది సామ్‌. కటింగ్‌ చేసినందుకు గానూ ప్రీతమ్‌ తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని కామెంట్‌ కూడా జోడించిది సమంత. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news