ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టేవాళ్ళకి కేంద్రం బ్యాడ్ న్యూస్ చెప్పనుందా..?

-

ఈ మధ్య కాలం లో చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. వీటి ద్వారా మంచిగా రాబడి కూడా వస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న కీలక ప్రకటన తీసుకోనుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే సామాన్యులకు కేంద్రం బ్యాడ్ న్యూస్ చెప్పబోతోందా అనేది తెలియాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

money
money

ఇప్పటికే పీఎఫ్ అకౌంట్‌పై వడ్డీ రేటు తగ్గిస్తు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే రానున్న రోజుల్లో మధ్యతరగతికి కూడా షాక్ ఇవ్వనుందా? స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ప్రకారం చూస్తే తగ్గించేలానే కనపడుతోంది. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

ప్రస్తుతం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఆర్‌బీఐ తన ‘స్టేట్ ఆఫ్ ద ఎకానమీ’ నివేదికలో తెలిపింది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వడ్డీ రేట్లను 9 – 118 బేసిస్ పాయింట్లను తగ్గించాలంది. కేంద్ర ప్రభుత్వం చివరిగా 2021 డిసెంబర్ 31న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ పై వడ్డీ రేట్లను చూసింది. అప్పుడు మాత్రం మార్పు చెయ్యలేదు.

పీఎఫ్ వడ్డీ రేటు కోత, ఆర్‌బీఐ నివేదిక వంటి పలు అంశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి వడ్డీ రేట్లను తగ్గించేలానే వుంది. ఇది జరిగితే ప్రజలపై ఎఫెక్ట్ పడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన SSY, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ NSC, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ SCSS, పోస్టాఫీస్ డిపాజిట్లు వంటివి అన్నీ కూడా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఏ. కనుక ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టె వాళ్లపై ఎఫెక్ట్ పడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news