బీజేపీ మేనిఫెస్టో : కిసాన్‌ కార్డుపై లక్ష 0 వడ్డీతో రుణం, రామ మందిర నిర్మాణం

-

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ మేనిఫెస్టోని ప్రకటించింది. సంకల్స్‌ పత్ర పేరుతో విడుదల చేసిన ఈ ఎన్నికల ప్రణాళికను ప్రధాన మంత్రి మోడి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ తదితరులు విడుదల చేశారు. కాగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను వివరించారు. నవభారత నిర్మాణమే తమ థ్యేయమని, యావత్‌ భారతావని హర్షించే విధంగా తమ మేనిఫేస్టోని రూపొందించామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. మేనిఫేస్టో అనే కన్నా విజన్‌ డాక్యుమెంట్‌ అనడం సబబని చెప్పారు. 130 కోట్ల మంది భారతీయుల కోరికలు, ఆకాంక్షలు సాకారం చేయడమే తమ లక్ష్యమని, అందుకు అనుగుణంగా తమ మేనిఫెస్టో రూపొందిచబడందని తెలియజేశారు.

మరోసారి బీజేపీ మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణాన్ని చేర్చింది. అంతే కాకుండా వ్యవసాయానికి పెద్ద పీఠ వేసినట్లు తెలుస్తుంది. జీఎస్టీని సరళతరం చేయడం, పోలీస్ స్టేషన్‌లను ఆధునీకీకరణ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలుస్తుంది.



– కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీతో రుణం
– కిసాన్‌ సమ్మన్‌ నిధి కింద రైతులకు ఏటా రూ. 6000 ఆర్థిక సాయం
– వ్యవసాయ రంగానికి రూ. 25లక్షల కోట్ల కేటాయింపు
– 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
– 60ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు పింఛన్‌ పథకం
– రామ మందిర నిర్మాణం రాజ్యాంగ విధివిధానాలకు లోబడి అన్ని వర్గాల ఆమోదంతో
– పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందేలా చర్యలు
– 2022 నాటికి రైల్వేల్లో పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ

Read more RELATED
Recommended to you

Latest news