మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడియేషన్ కౌన్సిల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడియేషన్ కౌన్సిల్ డేటా అప్లికేషన్ మేనేజర్, సీనియర్ అప్లికేషన్ ప్రోగ్రామర్, జూనియర్ అప్లికేషన్ ప్రోగ్రామర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం మూడు ఖాళీలు వున్నాయి.
ఇక అర్హతల వివరాలను చూస్తే…పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ/బీఈ/ఎంసీఏ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా అభ్యర్థులకు అనుభవం కూడా ఉండాలి. ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ. 25,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 18, 2022. పూర్తి వివరాలను http://www.naac.gov.in/index.php/en/ లో చూడచ్చు.
ఈ మెయిల్ ఐడీ: [email protected]