Kangana: KGF2, రామ్ చరణ్, తారక్, బన్నీలపై కంగన కామెంట్స్ ఇవే..

-

ప్రశాంత్ నీల్ – యశ్ కాంబోలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ ఈ నెల 14న విడుదలైంది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా మేకర్స్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ విషయమై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపింది.

ఇన్ స్టా గ్రా మ్ వేదికగా కేజీఎఫ్ చాప్టర్ 2 ఫిల్మ్ పైన ప్రశంసలు కురిపించింది కంగన. ఎన్నో దశాబ్దాల నుంచి భారతీయ సినిమా ఇటువంటి యాంగ్రీ మ్యాన్ ను మిస్ అయిందని, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తర్వాత అనగా 1970 ల కాలం తర్వాత ఏర్పడిన స్పేస్ ను యశ్ భర్తీ చేశాడని, అద్భుతమని కొనియాడింది. ఈ క్రమంలోనే ఇన్ స్టా వేదికగా దక్షిణాది సినిమాలు, హీరోలపైన మరో పోస్టు పెట్టింది.

దక్షిణాది హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను కంగన పొగిడింది. వీరు తమ టాలెంట్, హార్డ్ వర్క్ తో పాటు ఎవరితోనైనా ఈజీగా కలిసిపోతారని, ఈ లక్షణం వారికి సంప్రదాయాల నుంచి వచ్చిందని, అది వారిని తమ అభిమానులకు మరింత దగ్గర చేసిందని పేర్కొంది కంగన. కంగన కామెంట్స్ పైన దక్షిణ భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోలను కంగన పొగడటం పట్ల మెగా, నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

https://www.instagram.com/stories/kanganaranaut/2818092570461585341/

Read more RELATED
Recommended to you

Latest news