కోర్టు లో జరిగిన చోరీతో నాకెలాంటి సంబంధం లేదు..ఏ విచారణకైనా సిద్ధం: మంత్రి కాకాణి

-

నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడి కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు.ఈ విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసిది.నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలు ఉన్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచ్ క్లర్క్ స్థానిక చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నెల్లూరు కోర్టు సముదాయంలోని 4 వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో 13వ తేదీ అర్థరాత్రి కొందరు వ్యక్తులు చొరపడ్డారు.ఓ కీలక కేసులోని పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు వెళ్లారు.14వ తేదీ ఉదయం కోర్టుకు వచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలవలో గుర్తించారు పోలీసులు..కానీ అందులో ఉండాల్సిన పలు దాస్త్రాలు మాయమైనట్టు గుర్తించారు.కాగా ఆ దాస్త్రాల చోరీలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉన్నట్లు గా కొన్ని వార్తలు వినిపించాయి.

ఈ విషయమై స్పందించిన కాకాని ” కోర్టులో చోరీ తో నాకు ఎలాంటి సంబంధం లేదు..కోర్టులో చోరీ అంశంపై ఏ విచారణకైనా సిద్ధం.చోరీ ఘటనపై సిబిఐ విచారణ జరిపించుకోవచ్చు .ప్రభుత్వంలో భాగస్వామి గా ఉన్నందున ప్రభుత్వ విచారణ చేయించుకోవచ్చు.ప్రభుత్వ విచారణ తర్వాత ఎలాంటి విచారణకైనా సిద్ధం..పవన్ కళ్యాణ్ నటనకేే పనికొస్తారు.నాకు ఎవరితోనూ బేధాభిప్రాయాలునాకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవు అని అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news