జీ5 లో ‘ దికాశ్మీర్ ఫైల్స్’… హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్

-

దేశ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ ఇక ఓటీటీలో సందడి చేయబోతోంది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 1990లో కాశ్మీర్ లో జరిగిన పండిట్ల ఊచకోత ప్రధానాంశంగా రూపొందిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రధాని మోదీ ప్రశంసలు కూడా పొందింది. గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించాయి. సినిమా ఎంత హిట్ అయిందో… అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. బీజేపేతర పార్టీలు ఈ సినిమాను వ్యతిరేఖించారు. 

వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ త్వరలోనే జీ 5 ఓటీటీలోకి రానుంది. ఓటీటీ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని మూవీ టీం వెల్లడించింది.  హిందీలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, భాషా సుంబ్లీ మరియు చిన్మయ్ మాండ్లేకర్  కాశ్మీర్ ఫైల్స్ లో నటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news