కార్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇక ముప్పై నిమిషాల్లోనే..!

-

చాలా మంది ఇల్లు కొనడానికి, కారు కొనడానికి లోన్ తీసుకుంటూ వుంటారు. లోన్ తీసుకోవడం వలన మనం అనుకున్నవి కొనుగోలు చేసుకుని నెమ్మదిగా లోన్ క్లియర్ చేసుకోచ్చు. అయితే సాధారణంగా లోన్ ప్రాసెస్ అనేది కాస్త సమయం పడుతుంది. కానీ దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కారు కొనుక్కోవాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు 30 నిమిషాల్లో కారు లోన్ డెలివరీని అందించడం మొదలు పెట్టింది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ కారు లోన్స్ ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌పై 30 నిమిషాల్లో కస్టమర్లకు ఎండ్-టూ-ఎండ్ కారు లోన్లను ఇస్తోంది. ఇలాంటి సర్వీసు ఇదే మొదటి సారి. సురక్షితమైన వెహికిల్ ఫైనాన్సింగ్ పొందాలంటే 48 గంటల నుంచి 72 గంటల వరకు పడతుంది.

అలాంటిది ఇంత త్వరగా కార్ లోన్ ఇవ్వడం అనేది గొప్ప విషయమే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు కారు లోన్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ బ్యాంక్ ఇప్పుడు 30 నిమిషాల్లో కారు లోన్ ఇస్తోంది. త్వరలో అయితే టూవీలర్ లోన్లను కూడా జారీ చేయాలని అనుకుంటోంది.

ఈ లోన్స్ అన్నీ కూడా డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారానే. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో కారు రుణాలను పొందే ప్రక్రియను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈజీగా మార్చేసింది. ఇండస్ట్రీలో ఇది పెద్ద మొత్తంలో గేమ్ ఛేంజర్‌గా మారుతుంది అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రిటైల్ నేషనల్ హెడ్ అరవింద్ కపిల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news