ఈ మధ్య చాలా మంది పంటలు పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగాన్ని కూడా వదులుకుని పంటలపై ఆసక్తి చూపించడం గొప్ప విషయం. పైగా సాగు చేసి చాలా మంది మంచిగా రాబడిని పొందుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అని తికమక పడుతున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యవసాయం చేసి లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇదే దిశలో వెళ్లొచ్చు. నిజానికి సంప్రదాయ పంటలు పండిస్తే లాభం తక్కువగా ఉంటుంది కానీ వాణిజ్య పంటలు పండిస్తే లాభాలు అధికంగా వస్తాయి. పైనాపిల్ పంటలు పండించి మంచిగా లాభాన్ని పొందవచ్చు. దీనికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.
పలు రాష్ట్రాల్లో రైతులు ఈ పంటలు పండించి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో పైనాపిల్ పంటను 12 నెలల పాటు సాగు చేస్తున్నారు. నిజానికి వేరే పంటలతో పోల్చుకుంటే దీనిలో ఆదాయం ఎక్కువగా వస్తోంది. దీనిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. రోజు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని లేదు అలానే పెద్దగా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పని లేదు.
పైగా ఈ పంటకు ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. ఈ పంట పండడానికి 18 నుండి 20 నెలల సమయం పడుతుంది. పండు బాగా పండిన తర్వాత కోత మొదలు పెట్టొచ్చు అయితే పైనాపిల్ మొక్కలు ఒక్కసారి మాత్రమే పండ్లను ఇస్తాయి. అంటే పంట నుంచి ఒకసారి మాత్రమే పైనాపిల్ పొందొచ్చు. ఆ తర్వాత మళ్లీ అవి పండవు. మళ్లీ విత్తనాలు నాటాలి. కిలో పైనాపిల్ 150 నుంచి 200 వరకు పలుకుతోంది. మీరు కనుక హెక్టారుకు 30 టన్నుల పైనాపిల్ ఉత్పత్తి చేస్తే లక్షల్లో ఆదాయం వస్తుంది ఇలా పైనాపిల్ పంట ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.