భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల వర్షపునీరు వచ్చి చేరింది. అంతేకాకుండా పలుచోట్ల విద్యుత్‌ను అధికారులు నిలిపివేశారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయం మయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సైదాబాద్, చంపాపేట్, నాగోల్, కొత్తాపేట్, సరూర్‌నగర్, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, అల్వాల్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనూ భారీగా వర్షం పడుతోంది. ఎండవేడిమితో అల్లాడిపోతున్న నగర వాసులకు ఈ వర్షంతో ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురిసింది.