యూపీ : మ‌సీదు చెప్పిన అస‌లు నిజం ?

-

ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలోని జ్ఞానవాపి – శృంగర్ గౌరి కాంప్లెక్స్లో ఉన్న జ్ఞానవాపి మసీదు సమీపంలో అధికారులు వీడియో కెమెరాతో సర్వే నిర్వహించారు. మొత్తం మసీదు చుట్టూ వీడియో రికార్డ్ చేశారు. అందులో భాగంగా కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. మసీదు గోడలో కలిసి ఉన్న రెండు స్వస్తిక్ ల ఆనవాళ్లు కనిపించాయి. సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని సర్వేని అడ్డుకున్నారు..హిందువులకు ఎంతో పవిత్రమైన ఆ స్వస్తిక్‌లు మసీదు గోడల పై బయట పడటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. దీంతో అధికారులు సర్వే నిలిపివేశారు. ఈ సంద‌ర్భంగా సర్వే బృందంలోని వీడియోగ్రాఫర్ ఒకరు వార్తా సంస్థ ఆజ్ తక్ తో ఈ విషయం గురించి చెప్పారు. సర్వే నిర్వహిస్తున్నప్పుడు మసీదు వెలుపల పురాతన స్వస్తిక్‌లను చూశామని చెప్పారు. స్వస్తికలు పూర్వ కాలం లోనే మసీదు పై చెక్కినట్లు తెలుస్తుంది.ఈ విషయం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.

స్వస్తిక్-ల విషయంపై విచారణ జరిపేందుకు అధికారులు మసీదులోకి ప్రవేశిస్తుండగా అక్కడికి చేరుకున్న ముస్లిం మతపెద్దలు ఈ విషయం పై మండిపడ్డారు. సర్వేను వెంటనే నిలిపివేయాలని కోరారు. జ్ఞానవాపి మసీదు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వీడియోతో కూడిన సర్వే భూ సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఈ సర్వే చేపట్టారు. కోర్టు నియమించిన అధికారి మరియు న్యాయవాదుల బృందం శుక్రవారం ఈ ప్రాంతానికి సమీపంలో తనిఖీలు నిర్వహించిన తరువాత ఈ ప్రాంతంలో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మత పరమైన గొడవలు జరగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు.

జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలను పూజించడానికి అనుమతి కోరుతూ ఢిల్లీకి చెందిన రాఖీ సింగ్, లక్ష్మీ దేవి, సీతా సాహు మరియు ఇతర మహిళలు కొందరు దాఖలు చేసిన పిటిషన్ పై వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల అనంతరం ఈ సర్వేని కొనసాగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news