ఈ అమ్మవారిని భక్తితో పూజిస్తే పోగొట్టుకున్న వస్తువులు దొరుకుతాయట..

-

మనుషులు బాగా స్వార్దపరులు.. ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేదా, ఏదైనా విలువైన వస్తువు పోయినప్పుడు దేవుడిని ఎంతగా ప్రార్దిస్తారో అందరికి తెలుసు..బాధలన్నీ చెప్పుకుని ఉపశమనం కల్పించాలని కోరుకుంటారు. అవన్నీ తీరుతాయో లేదో అనే విషయం పక్కనపెడితే చాలామందికి ఒక నమ్మకం అనేది ఉంటుంది.కొన్ని ప్రాంతాలలోని అమ్మవార్లకు నిజమైన శక్తులు ఉన్నాయని, ఏదైనా కోరుకుంటే వెంటనే తీరుతుందని నమ్మకం ఉంటుంది. నిజంగానే పెద్ద కోరికలు తీర్చె అమ్మవారు కూడా ఉన్నారు. ఆ అమ్మవారు తమిళనాడులో కొలువై ఉంది.

రాష్ట్రంలోని రత్నమంగళంలో కొలువైన అరై కాసు అమ్మన్ కి మొక్కుకుంటే మాత్రం ఎంతటి కష్టమైనా తీరిపోతుందట. మరీ ముఖ్యంగా విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకున్నవారు అరైకాసు అమ్మన్ ని ప్రార్థిస్తే అవి దొరుకుతాయని విశ్వాసం.అసలు ఆ అమ్మవారికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..పుదుక్కోట దగ్గరున్న గోకర్ణంలో ప్రగడాంబాల్ అనే అమ్మవారు కొలువు తీరి పూజలందుకుంటోంది. ఒకసారి విజయనగరాన్ని పాలిస్తున్న రాజు ఒక ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత వెదికినా అది దొరక్కపోవడంతో ప్రగడాంబాల్ అమ్మవారిని ప్రార్ధించాడు.

ఆ తర్వాత ఆ పత్రం దొరికింది. సంతోషించిన రాజు అమ్మవారికి కృతజ్ఞతగా ఆవిడ రూపాన్ని అరకాసు విలువైన నాణెంపై ఓ వైపు ముద్రించి,వాటిని పండుగలు, ప్రత్యేక దినాల్లో రాజ్యంలో ప్రజలకు పంచిపెట్టేవాడు. అప్పటి నుంచి అరైకాసు అమ్మగా మారిపోయింది.ఏదైనా వస్తువులు పోతే అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకుంటే వెంటనే దొరుకుతాయట..అయితే, ఓ సారి రత్నమంగళలో లక్ష్మీ కుబేర ఆలయం ఉంది. ఏటా కళ్యాణోత్సవం సమయంలో అత్యంత విలువైన లక్ష్మీదేవి ఆభరణం ఒకటి కనిపించలేదు. ఎంత వెతికినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దీంతో ఆ ఆలయ మేనేజింగ్ ట్రస్టీ అరై కాసు అమ్మవారిని ప్రార్ధించి, ఆ ఆభరణం దొరికితే అరైకాసు అమ్మకి అక్కడ ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారట. ఆ తర్వాత ఆభరణం దొరకడంతో ట్రస్ట్రీ కుబేర ఆలయం సమీపంలోనే అరై కాసు అమ్మన్ కి ఆలయాన్ని కట్టించారు. ప్రతి ఏటా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలను, ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఎప్పుడైనా తమిళనాడు వెళితే ఈ అమ్మవారిని సందర్షించండి..

Read more RELATED
Recommended to you

Latest news